నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి మండలంలోని రేషన్ కార్డుదారులు సంబంధిత రేషన్ దుకాణంలో కుటుంబ సభ్యుల వేలిముద్రలు ధ్రువీకరించుకోవాలని మండల్ రేషన్ డీలర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మల్లిఖార్జున్ యాదవ్ ఒక ప్రకటన లో తెలిపారు.
కార్డులో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడు రేషన్ దుకాణంలోని పాస్ యంత్రంలో వేలిముద్రలు ద్రువీకరించుకోవాలన్నారు. కార్డుదారుల సౌకర్యం కోసం బియ్యం పంపిణీ తరువాత కూడా తెరిచి ఉంచుతారని తెలిపారు.