నమస్తే శేరిలింగంపల్లి: నిరుద్యోగులను మోసం చేసిన బిఆర్ఎస్ పాలన తీరుకు వ్యతిరేకంగా బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన 24 గంటల ఉపవాస దీక్షను భగ్నం చేసి, అక్రమ అరెస్ట్ కు పాల్పడటం పట్ల బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే మొవ్వా సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా నిరసన తెలిపారు. బి.ఆర్.ఎస్ ప్రభుత్వ అరాచకాలకు అంతు లేకుండా పోతుందని, పోలీసులు కూడా బి.ఆర్.ఎస్ ప్రభుత్వానికి తొత్తులుగా మరి వారి అనుసంధానంలో పని చేస్తున్నారని, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిన కేసీఆర్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ దీక్ష చేస్తే.. అక్రమంగా అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు.
ఈ కార్యక్రమం లో కొరదల నరేష్, ప్రభాకర్ యాదవ్ , జానకి రామరాజు, రవీందర్ రావు, చింతకింది గోవర్ధన్ గౌడ్, మహిపాల్ రెడ్డి, మూల అనిల్ కుమార్ గౌడ్, స్వామి గౌడ్, నరేందర్ ముదిరాజ్, శాంతిభూషణ్ రెడ్డి, వీరయ్య చారీ, దుర్గాప్రసాద్, చిట్టారెడ్డి ప్రసాద్, శ్రీధర్, నర్సింగ్, కృష్ణ, జగన్ గౌడ్, బాబూరెడ్డి, రత్న కుమారి, రేణుక, ఆనంద్, శ్రీనివాస్ చారీ, పవన్, రఘురామ్, జగదీశ్ కుమార్, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, మోర్చాల నాయకులు, కార్యకర్తలు, వివిధ అనుబంధ సంఘాలు కలిసి పాల్గొన్నారు.