నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తాండ బస్తీలో శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్, మేరమా యాడిల విగ్రహ ఊరేగింపు, శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్, అమ్మవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట “మహాభోగ్ బండారో” కార్యక్రమాలు వేడుకగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు ఉప్పలపాటి శ్రీకాంత్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో తండావాసులు స్వామి నాయక్, తిరుపతి నాయక్, సీతారాం నాయక్, గోపి నాయక్, లకపతి నాయక్, మోహన్ నాయక్, లక్సమన్ నాయక్, దశరథ్ నాయక్, లేవుడియా రవి, శ్రీను నాయక్, కాళ్య నాయక్, బంజారా ముఖ్య నాయకులు మోహన్ సింగ్, బంజారా స్వరం ఎస్పీ నాయక్ పాల్గొన్నారు.