నమస్తే శేరిలింగంపల్లి : శిల్పారామం మాదాపూర్ లో సప్తస్వర అకాడమీ అఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్ ఆధ్వర్యం లో సంగీత నృత్య విభావరి నిర్వహించారు. పాహి పాహి, రామ రామ, మారుతీ మారుతీ, గేమ్ గేమ్ గణపతి, మొదలైన భజనలు, అన్నమాచార్య కీర్తనలు, రామదాసు కీర్తనలు, ఆలపించారు.
నిత్య, కమాలాశ్రీ, నందు, అముక్త, శ్రీహిత, శ్రీనిక, యువన్, యాషిక, శ్రీవిద్య, కార్తీక్, పూజిత, వేదశ్రీ, గౌరీ మొదలైన వారు ఆలపించారు. వినాయక కౌతం, రామాయణ శబ్దం, ఆధ్యాత్మ రామాయణ కీర్తన మొదలైన అంశాలను శ్రీనిధి, మహతి, మైథిల్యా మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.