భావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం

  • ప్రధానోపాధ్యాయురాలు షమీమ్ పదవి విరమణ వేడుకల్లో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ గోపినగర్ లోని ప్రభుత్వ మండల ప్రజా పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు షమీమ్ పదవి విరమణ వేడుకగా జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల బృందం కార్పొరేటర్ ని ఘనంగా సత్కరించారు.

అనంతరం కార్పొరేటర్ ప్రధానోపాధ్యాయురాలు షమీమ్ ని శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానోపాధ్యాయురాలు షమీమ్ గత 7 సంవత్సరాలుగా ఈ పాఠశాలలో తన విధులు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా నూతనంగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు శివరాజ్ ని అభినందించారు. భావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో ప్రధానంగా ఉపాధ్యాయుల పాత్ర గొప్పదని పేర్కొన్నారు. ప్రతి విద్యార్ధి ఒక లక్ష్యం పెట్టుకోని దాన్ని సాధించడం కోసం నిరంతరం కఠోరంగా శ్రమ చేయాలని వివరించారు. ప్రస్తుత సమాజంలో సామజిక మధ్యమాల ప్రభావం విద్యార్థుల పై, యువత పై విపరీతంగా ఉందని దాని బారినుంచి విద్యార్థులను బయటికి తీసువస్తే యువతకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని దిశా నిర్దేశం చేశారు.

ప్రధానోపాధ్యాయురాలు పాఠశాల కోసం ఎంతో కృషి చేసారని, వారు ఆయురారోగ్యాలతో ఉండాలంటూ ఆయన ప్రార్దించారు. పాఠశాల అభివృద్ధికి, వారితో ఉన్న మధుర జ్ఞాపకాలను, అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, గోపి నగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, కె ఎన్ రాములు, దివాకర్ రెడ్డి, నర్సింహా, మహేష్, సుభాష్, దివ్య, నిరూప, తుకారామ్ పాల్గొన్నారు.
పాఠశాల బృందం : ప్రధానోపాధ్యాయులు శివరాజ్, ఎంఈఓ వెంకటయ్య, శ్రీనివాస రావు, పాండురంగ రెడ్డి, విష్ణు వందన, హిమ బిందు, శోభా రాణి, సుజాత, ఎస్ అశ్విన్, తదితర పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here