శేరిలింగంపల్లి, మార్చి 9 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ప్రజావాణిలో హఫీజ్‌పేటలోని వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ జనరల్ మేనేజర్ కి డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జితేందర్ మాట్లాడుతూ హఫీజ్ పేట్ డివిజన్ హుడా కాలనీ విద్యా వాణి హై స్కూల్ వద్ద కొత్తగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లైన్ ను తక్కువ సైజ్ మట్టి పైపులతో వేస్తున్న సందర్బంగా డ్రైనేజ్ లైన్ సిమెంట్ పైపులతో 2 ఫీట్ల సైజ్ డ్రైనేజ్ లైన్ వెయ్యాలని కోరారు. హఫీజ్ పేట్ డివిజన్ జనప్రియ అపార్ట్ మెంట్ 5th ఫేస్, ఇంజనీర్ ఎంక్లేవ్, హఫీజ్ పేట్ విలేజ్ , సాయి నగర్ , యూత్ కాలనీలలో వివిధ ప్రధాన కూడళ్ల వద్ద అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి జగన్ గౌడ్, డివిజన్ బీజేపీ ఉపాధ్యక్షుడు ప్రసాద్ పాత్రో, బీజేపీ డివిజన్ కార్యదర్శి సుబ్బారావు , బీజేపీ నాయకుడు హరీష్, ఇతరులు పాల్గొన్నారు.






