చెరువుల్లోకి మురుగు నీరు రానివ్వద్దు: జడ్సీ ఉపేందర్‌రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి : చెరువులు, కుంటలు శుద్ధ జలాలతో నిండాలే తప్ప మురుగు నీటితో కాదని శేరిలింగంపల్లి జడ్సీ ఉపేందర్‌రెడ్డి అన్నారు. డ్రైనేజీలకు చెందిన మురుగు చెరువులలోకి వెళ్లకుండా పటిష్టమైన నియంత్రణ చర్యలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శేరిలింగంపల్లి జోన్‌ పరిధిలోని చందానగర్‌, శేరిలింగంపల్లి సర్కిళలో మల్కం చెరువు, పటేల్‌ చెరువు, మియాపూర్‌ చెరువు, గంగారం పెద్ద చెరువు, ఖాయిదమ్మ కుంటలను అధికారులతో కలిసి జడ్సీ శుక్రవారం పరిశీలించారు. అనంతరం ఖాజాగూడ, గచ్చిబౌలి, లింగంపల్లి ప్రాంతాలలో పారిశుద్ధ్య నిర్వహణ పనులను ఆయన తనిఖీ చేశారు.

పటేల్‌ చెరువు పరిసరాలను పరిశీలిస్తున్న జడ్సీ ఉపేందర్‌రెడ్డి,చిత్రంలో డీసీ వంశీకృష్ణ ఇతర అధికారులు

ఈ సందర్భంగా జడ్సీ మాట్లాడుతూ మురుగు చెరువుల్లోకి చేరకుండా డైవర్షన్‌ ఛానళ్ల ద్వారా డ్రైనేజీలలోకి మళ్లించాలని, అందుకు సంబంధించిన సమగ్ర నిర్మాణాలను చేపట్టాలని ఆదేశించారు. పరిశుభ్రమైన నీరు చెరువులలోకి చేరేలా తూములు, ఛానళ్లను నిర్మించాలన్నారు. చెరువులలో పేరుకుంటున్న గుర్రపు డెక్కను తొలగించాలని, దోమల వ్యాప్తి నివారణకు చర్యలు చేపట్టాలని తెలిపారు. చెరువు పరిసరాల నివాసితులను భాగస్వాములను చేస్తూ దోమల నివారణ బాల్స్​‍ను వారితో వేయించాలన్నారు.

పరివాహక ప్రజలు వ్యర్థాలు చెరువులలో వెయ్యవద్దని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే దోమల వ్యాప్తి జరదన్నారు. విలువైన చెరువు స్థలాలు కబ్జాకు గురికాకుండా నోడల్‌ అధికారులు అనునిత్యం పర్యవేక్షణ చేపట్టాలని జడ్సీ ఆదేశించారు. పారిశుద్ద్య పనులలో మరింత పురోగతి నెలకొనాలని, వ్యర్థాలను ఎప్పటికపుడు తరలించాలని జడ్సీ ఉపేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన వెంట ఏసీ లేక్స్​​‍ శివకుమార్‌ నాయుడు, డీసీలు వంశీకృష్ణ, రజనీకాంత్‌రెడ్డి, ఇంజినీరింగ్‌, పారిశుద్ధ్య విభాగం, ఇరిగేషన్‌ అధికారులున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here