శేరిలింగంపల్లి, మార్చి 9 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీదుబండలో ఉన్న శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం వార్షికోత్సవం కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, సీనియర్ నాయకుడు మారబోయిన రాజు యాదవ్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసి అన్నదానం కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, పవన్, కోడిచర్ల రాము, మహేష్, సత్యనారాయణ, రాజు సాగర్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






