- ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని కలిసి విన్నవించిన రాయదుర్గం విద్యా కమిటీ సభ్యులు
నమస్తే శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో రాయదుర్గం విద్యా కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాయదుర్గం విద్యా కమిటీ సభ్యులు పలు సమస్యలను ఎమ్మెల్యే గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. రాయదుర్గం లోని ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ రాయదుర్గం ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాలలో మౌళికవసతులు కల్పిస్తామని, అన్ని రకాల చర్యలు తీసుకుంటామని, అభివృద్ధి చేసి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటామని, త్వరలోనే డిగ్రీ కాలేజ్ ప్రారంభించుకుంటాని, ఖానమెట్ లో డిగ్రీ కాలేజ్ ఏర్పాటుకు స్థలం కేటాయించామని, త్వరలోనే పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయదుర్గం విద్యా కమిటీ సభ్యులు కృష్ణ గౌడ్, నరేందర్ ముదిరాజ్, సురేష్, ప్రభాకర్, సుదర్శన్ పాల్గొన్నారు.