నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలో బ్రహ్మ కుమారీస్ శాంతి సరోవర్ 20వ వార్షికోత్సవం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ బ్రహ్మ కుమారీస్ వారి శాంతి సరోవర్ 20వ వార్షికోత్సవం నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైన విషయమన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనడం గొప్ప అనుభూతి అని, విద్యా, దాతృత్వ, ఆధ్యాత్మిక, ధ్యానం వంటి గొప్ప అంశాలు బోధిస్తూ.. మానవ జీవితం సాత్వికమయమవుతుందని తెలిపారు. యోగ, ఆధ్యాత్మిక ప్రార్థనలు చేస్తూ శాంతి ప్రవచనాలు చేస్తారని, సమాజ హితం గొప్ప కార్యక్రమాలు చేస్తారని కొనియాడారు.