శేరిలింగంపల్లి, మార్చి 16 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ వేముకుంట బస్తీలో బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్, మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం మహిళలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆమె వారికి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌస్, శేఖర్, ప్రమోద్, సునీత, శిరీన్ తదితరులు పాల్గొన్నారు.






