నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తాండలో తీజ్ పర్వదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ గిరిజనులు ఎంతో ఆనందయకంగా జరుపుకునే పండుగ తీజ్ పండుగ అని, ప్రతి ఒక్కరికి తీజ్ పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు చెప్పారు. గిరిజనుల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారని, భారత సాంస్కృతి సంప్రదాయాలను కాపాడిన మహనీయులు సేవాలాల్ మహరాజ్, దేశం పట్ల ధర్మం పట్ల ఆయన ఎన్నో సేవలు చేశారని పేర్కొన్నారు. దేశంకోసం, హిందు ధర్మంకోసం, ఆయన సేవలు కొనియాడుతూ గిరిజనుల అభ్యున్నతి కోసం ఎంతగానో కృషి చేశారన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మోహన్ ముదిరాజు, గంగాధర్, నడిగడ్డ తండా వాసులు స్వామి నాయక్, లకపతి నాయక్, తిరుపతి నాయక్, శంకర్ నాయక్, రత్నాకర్, అబ్రహం, సుధాకర్, జీత్తు నాయక్, మధు నాయక్, సీతారాం నాయక్, హనుమంతు నాయక్, గోపి నాయక్, తుకారాం నాయక్ దశరత్ నాయక్, హరి నాయక్ పాల్గొన్నారు.