శేరిలింగంపల్లి, మార్చి 16 (నమస్తే శేరిలింగంపల్లి): గోపనపల్లి గ్రామంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ఉగాది ఉత్సవాలను పురస్కరించుకొని పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఈ నెల 19న రాత్రి 8 గంటలకు నిర్వహించనున్న స్వామివారి పల్లకీ ఉరేగింపుకు రావాలని వారు గాంధీని కోరారు. శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని పునరుద్దరణ చేపట్టి 25 సంవత్సరాలు పూర్తయినందువల్ల ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని దేవాలయ కమిటీ అధ్యక్షుడు రవీంద్ర ప్రసాద్ దూబే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ రంగనాథ స్వామి దేవాలయ కమిటీ అధ్యక్షుడు రవీంద్ర ప్రసాద్ దూబే, ప్రధాన కార్యదర్శి ఇ. అనిల్ కుమార్, కోశాధికారి పి. నర్సింగ్ రావు, సభ్యుడు శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.






