నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ హేమదుర్గ మాత దేవాలయ 24వ వార్షికోత్సవ వేడుక వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్, నియోజకవర్గ నాయకులు, డివిజన్ నాయకులతో కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ ప్రగణంలో నిర్వహించిన అభిషేకాలు, హోమం, కుంకుమార్చనలు అన్నదానం కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు అమ్మవారి ఆశీసులు ఎల్లప్పుడూ ఉండాలని వారు ప్రార్ధించారు.