- ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ పరిధి గోపన్ పల్లి లోని రంగనాథస్వామి దేవాలయం ప్రాంగణంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ మహోత్సవం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయిబాబా, అయ్యప్ప స్వాములు, భక్తులతో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజు ముదిరాజు, ప్రసాద్, విజయలక్ష్మి పాల్గొన్నారు.
