నమస్తే శేరిలింగంపల్లి : ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా బీఆర్‌ఎస్ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ హ్యాట్రిక్ సాధించడం పట్ల ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ శుభసందర్బంగా శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిసి పూలమాల వేసి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వీరేశం గౌడ్, రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుధ్ యాదవ్, డివిజన్ సీనియర్ నాయకులు, బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్ , బూత్ కమిటీ మెంబర్లు, మహిళా నాయకురాళ్లు, కాలనీ అసోసియేషన్ అనుబంధ సంఘ ప్రతినిధులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.