నమస్తే శేరిలింగంపల్లి: అప్రజాస్వామిక అరెస్టులను యంసిపిఐయు పార్టీ కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నదని, వెంటనే అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని యంసిపిఐయు గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వర్గ సభ్యులు , ఇస్లావత్ దశరథ్ నాయక్ అన్నారు. మియాపూర్ ముజఫర్ అహమ్మద్ నగర్ లోని యంసిపిఐయు పార్టీ జిల్లా కార్యాలయం నుంచి పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. స్వేచ్ఛ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఏ.జి ఆఫీస్ ఎదురుగా అంబేద్కర్ రిసోర్స్ సెంటర్ లో ఆదివారం భారత రాజ్యాంగం v/s మనుస్మృతి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ప్రముఖ సీనియర్ సంపాదకుడు సతీష్ చంద్ర, రచయిత్రి జూపాక సుభద్ర, ప్రజా కవి జయరాజు వక్తలుగా పాల్గొన్నారు. సదస్సు అనంతరం మధ్యాహ్నం ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మనస్మృతి పత్రాలు దహనం చేస్తారనే అనుమానంతో పోలీసులు వక్తలతోపాటు హాజరైన వారందరినీ అరెస్టు చేశారు.


కార్యక్రమానికి హాజరైన AIFDY రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనం సుధాకర్, స్వేచ్ఛ JAC నాయకులను, వివిధ ప్రజా సంఘాల వారిని నాంపల్లి పిఎస్ కు తరలించారు. సతీష్ చంద్ర, జయరాజు, జూపాక సుభద్ర తదితరులను ముషీరాబాద్ పి.యస్ కు తరలించారు.