- అలరించిన నృత్య ప్రదర్శనలు
నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా భారతీయ కళాక్షేత్రం శిష్య బృందం సాయినాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నమయ్య సంకీర్తనలు కూచిపూడి, కోలాటం ప్రదర్శనలు అలరించాయి.

ఇందులో భాగంగా సత్యనారాయణ శిష్య బృందం భక్తి సంకీర్తనలు ఆలపించారు. రశ్మిత, అశ్విని శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలో భాగంగా వినాయక కౌతం, పుష్పాంజలి, గణేష్ వందన, జతిస్వరం, రామాయణ శబ్దం, హనుమ చాలీసా, జనుత శబ్దం, తరంగం, మల్లికార్జున కౌతం, మంగళం మొదలైన అంశాలను ప్రదర్శించి మెప్పించారు. వైశాలి బృందం కోలాటం ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అరుణ ఉపద్రష్ట ముఖ్య అతిధిగా విచ్చేసి కళాకారులను అభినందించారు.