- మూడు రోజుల పాటు జరగనున్న పూజ కార్యక్రమాలు
- మొదటి రోజు కాకడ హారతి తో మొదలై అల్పాహారంతో ముగింపు
నమస్తే శేరిలింగంపల్లి: విశాఖ శ్రీ పీఠ పరిపాలిత షిర్డీ సాయి, అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయ సముదాయంలో ఆ ఆలయ ద్వాదశ వార్షికోత్సవ మహోత్సవాలు వేడుకగా జరిగాయి. ఉత్తర పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి శుభాశీస్సులతో 3రోజులపాటు ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు.

మాఘ శుద్ధ పౌర్ణమి శనివారం నుంచి మాఘ బహుళ విదియ సోమవారం వరకు ప్రత్యేక చేపట్టనున్నారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం 5.45 గంటలకు కాకడ హారతి (ప్రవనీత హారతి), 8 గంటలకు పంచామృత ఫలాభిషేకము, 10 గంటలకు అలంకరణ, అర్చనలు, 10.30 నిమిషాలకు గణపతిపూజ, పుణ్యహవాచనం, పంచగవ్యప్రాశన, దీక్షాధారణ మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్న హారతి, మధ్యాహ్నం 12.30 గంటలకు రాఘవేందర్, సౌజన్య దంపతుల ఆధ్వర్యంలో అన్నదానం, సాయంత్రం 4 గంటలకు.. అంకురారోపణ, మంటపారాధనలు, అగ్నిప్రతిష్ట లక్ష్మీ గణపతి, దత్తాత్రేయ, మన్యు సూక్త హోమములు నిర్వహించారు.
సాయంత్రం 6.15 నిమిషాలకు సంద్యా హారతి (దూప్ హారతి) గణేష్ ఎంటర్ టైన్ మెంట్ & ఈవెంట్స్ ఆధ్వర్యంలో సంగీత విభావరి వేడుకగా చేపట్టారు. రాత్రి 9 గంటలకు శేజ హారతి, 9.30 కు శ్రీకాంత్, కుసుమ పావని దంపతులు (లక్ష్మి గణపతి ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో అల్పాహారం కార్యక్రమంతో మొదటి రోజు కార్యక్రమాలు ముగిశాయి.