సమిష్టిగా పనిచేద్దాం… కాంగ్రెస్ జెండా ఎగురవేద్దాం

  • మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ సునీతారెడ్డి
  • ప్రియాంక గాంధీ సభను విజయవంతం చేద్దామని పిలుపు
  • చేవెళ్ల కె.జి.ఆర్ ఫంక్షన్ హాల్ వద్ద సమీక్ష సమావేశంలో పాల్గొని మాట్లాడిన జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి : సమిష్టిగా పనిచేసి కాంగ్రెస్ జెండా ఎగరేద్దామని, ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని, బీజేపీతోనే పోటీ.. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ గల్లంతవడం ఖాయమని బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు కాంగ్రెస్ లోకి రావాలంటూ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, చేవెళ్ల పార్లమెంటరీ కాంగ్రెస్ నేత, జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి పిలుపునిచ్చారు.

చేవెళ్ల కె.జి.ఆర్ ఫంక్షన్ హాల్ వద్ద సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న జగదీశ్వర్ గౌడ్

ఈ నెల 27వ తారీఖున చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారంటీలలో భాగంగా మరో రెండు ఉచిత పథకాలు 200 యూనిట్లు ఉచిత విద్యుత్, రూ. 500కే గ్యాస్ పథకాలను ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభం చేయనున్నదని తెలిపారు. తదనంతరం సాయంత్రం 4గంటలకు నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్ల గురించి  సంబంధించిన విషయాలపై చేవెళ్ల కె.జి.ఆర్ ఫంక్షన్ హాల్ వద్ద సమీక్ష సమావేశం నిర్వహించారు. మాట ఇచ్చాం, చేసి చూపిస్తామని, అభివృదే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తున్నామని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ తెలిపారు.

సమావేశంలో పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు

ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, మాజీ మంత్రి ఎమ్మెల్సీ మహేంధర్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి, పరిగి శాసనసభ్యులు రామ్ మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు చల్లా నరసింహా రెడ్డి, శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్, చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జీ భీమ్ భరత్, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ లు, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాళ్ళు పెద్ద ఎత్తున సమావేశంలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here