- 200 మందికి అవార్డుల అందజేత
నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, స్వరమహతి కళాపరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి వివిధ కళల పోటీలు సృజనోత్సవం 2024 అవార్డు ఉత్సవాలు స్థానిక జాతీయస్థాయి వేదిక రవీంద్రభారతిలో అంగరంగ వైభవంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా ఈవీ శ్రీనివాస్ రెడ్ క్రాస్ సొసైటీ, వరంగల్, ప్రముఖ సినీ నిర్మాత జీవి నాయుడు వీరాంజనేయ ప్రొడక్షన్స్, మామిడి హరికృష్ణ డైరెక్టర్ భాషా సాంస్కృతిక శాఖ, బి. కేశవ, సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్, డాక్టర్ ఆరవ ఆంజనేయులు, డాక్టర్ శ్రీనివాస వరప్రసాద్, పివిఆర్ చంద్ర, భాస్కర్ లక్ష్మీ చైర్మన్ క్యాండిడేస్ ఇంటర్నేషనల్ స్కూల్, జై, మేనేజింగ్ డైరెక్టర్ క్యాండిడాస్ ఇంటర్నేషనల్ స్కూల్, ప్రముఖ పేరిణి నర్తకులు బి. శ్రీనివాస్, బాలమురళి, వైవివిఎస్ లక్ష్మణ్ కుమార్, చైర్మన్ వీవీ బిజినెస్ గ్రూప్, ప్రముఖ సినీ ఓటీవీ నటి బంధనంపూడి శ్రీదేవి పాల్గొన్నారు. పోటీలలో గెలిచిన సుమారు 200 మందికి అవార్డులను అందజేశారు.
సేవారత్న అవార్డును ఈవీ శ్రీనివాసరావు, డాక్టర్ మంజుల అనగాని పద్మశ్రీ అవార్డు గ్రహీతకి, నృత్య రత్న అవార్డును ప్రముఖ పేరిణి నర్తకులు బి. శ్రీనివాసరావుకి, అరవ ఆంజనేయులుకి, లలిత నృత్య కళానికేతన్ రాజమహేంద్రవరం, సంగీత విభాగంలో.. సంగీత రత్న అవార్డును కేశవ దాసుకి అందజేశారు.
ఈ సందర్భంగా కళల నుంచి జాతీయ సమైక్యతను పెంపొందించే విధానాలను విశిష్టతను స్వరమహతి కళాపరిషత్ అధ్యక్షులు డాక్టర్ బంధనపూడి ఆదిత్య కిరణ్ తెలిపారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయ కలలను భావితరాలకు అందిస్తూ ఇంతటి కార్యక్రమం జయప్రదం కావడానికి కారణమైన అభ్యర్థులు వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. ప్రతి సంవత్సరం ఈ పోటీలు జరుగుతాయని, దీనిని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమానికి తోడ్పడ్డ భాషా సంస్కృతిక శాఖకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.