- ఎల్లమ్మ చెరువు నుంచి తులసి వనం వరకు చేపడుతున్న పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి : ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ చెరువు నుంచి తులసి వనం వరకు రూ. 30 లక్షల అంచనావ్యయంతో చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులను కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నామని, రద్దీ ప్రాంతంలో ప్రజల సౌకర్యార్థం అన్ని హంగులతో రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని, రోడ్డు విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, రోడ్డు విస్తరణ పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని తెలిపారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని, అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానాని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఈఈ గోవర్ధన్ గౌడ్, ఏఈ శ్రావణి, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాశినాథ్ యాదవ్, శివరాజ్ గౌడ్, చినోళ్ళ శ్రీనివాస్, సంతోష్ బిరాదర్ మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.