- ఆసుపత్రి సూపరింటెండెంట్ అనురాగినిని సన్మానించిన కాలనీవాసులు
నమస్తే శేరిలింగంపల్లి : కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో ప్రసూతి సేవలు బేషుగ్గా ఉన్నాయని మియాపూర్ ప్రజయ్ సిటీ అపార్ట్మెంట్ సెంట్రల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాయుడు, శ్రీరాంనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శివకుమార్ కితాబునిచ్చారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ అనురాగిని రెడ్డిని, ఆర్ ఎం ఓ డాక్టర్ చంద్ర కృష్ణను సన్మానించారు.
సూపరింటెండెంట్ వచ్చినప్పటి నుంచి ఆసుపత్రిలో ఓపీలు ఎక్కువగా పెరిగాయని, డెలివరీ పేషెంట్లు అధికంగా వస్తున్నారన్నారు. కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అందుతున్న ప్రసూతి సేవలు తెలుసుకొని పురుడు కోసం సాప్ట్ వేర్ ఇంజనీరు వెంకట శ్వేత ఇక్కడే చేరి మగ బిడ్డకు జన్మనిచ్చిందని, ఆసుపత్రిలో అందుతున్న సేవలకు ఇందుకు నిదర్శనమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ చంద్ర కృష్ణ, వెంకటరమణ. డాక్టర్ మల్లేష్, వెంకటేష్, చంద్రమౌళి పాల్గొన్నారు.