అంగరంగ వైభవంగా శ్రీ గోదాదేవిమాత సహిత శ్రీరంగనాధాస్వామి కళ్యాణ మహోత్సవం

 

నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాసం చివరిరోజు భోగి పండగ పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ గోదాదేవిమాత సహిత శ్రీరంగనాధాస్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం 4.30 కు స్వామివారికి మేలుకొల్పు హారతి 5 గంటలకు విశేష అర్చన విశేష పుష్పాలంకారం, 5.30 నిలకు బాలభోగం నివేదన హారతి తీర్ధ ప్రసాదములు తదనంతరం ఉదయం 10 నుండి శ్రీగోదాదేవి కల్యాణం జరిపించారు. ఈ కళ్యాణంలో సుమారుగా 40 మంది దంపతులు పాల్గొన్నారు. 12.30 గంటల నుండి భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో దాతలతోపాటుగా దేవాలయ కార్యవర్గ సభ్యులు దేవాలయ సేవాసమితి సభ్యులు , అశేష భక్తులు పాల్గొని హారతి తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీరంగనాధాస్వామి శ్రీగోదాదేవి అమ్మ కృపకు పాత్రులయ్యారు.

అమ్మవారికి పూజలు చేస్తున్న ఆలయ పూజారులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here