సిద్ధిరామేశ్వర స్వామికి ఘనంగా ప్రత్యేక పూజలు

 

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ లోని రాజీవ్ గృహకల్ప కాలనీలో శ్రీశ్రీశ్రీ సిద్ధిరామేశ్వర స్వామి జయంతి సందర్బంగా నిర్వహించిన సిద్ధిరామేశ్వర స్వామి జయంతి ఉత్సవ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని పూజలు చేశారు.

సిద్ధిరామేశ్వర స్వామి జయంతి ఉత్సవ కార్యక్రమంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో సంఘం సభ్యులు

అనంతరం జయంతి ఉత్సవ కార్యక్రమం నిర్వహించిన సంఘ సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ సిద్దిరామేశ్వర స్వామి చిత్రపటానికి పూలమాల వేసి ప్రత్యేకపూజలు చేశారు. సుమారుగా 850 సంవత్సరాల క్రితం సోలాపూర్ లో జన్మించిన శ్రీ సిద్దిరామేశ్వర స్వామి ఆ రోజుల్లోనే కుల వ్యవస్థ ఉండకూడదని, కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ సమానంగా ఉండాలనే భావనతో కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి సిద్ధిరామేశ్వర స్వామి అని పేర్కొన్నారు. స్వామివారు సూచించిన మంచి మార్గంలో వారి అడుగుజాడల్లో అందరూ నడుచుకోవాలని, సాటివారికి సహాయం చేసే విధంగా ఉంటూ ప్రతిఒక్కరూ ఉన్నతమైన స్థాయికి ఎదగాలని అన్నారు. కార్యక్రమంలో సందయ్యనగర్ కాలనీ అధ్యక్షుడు బస్వరాజ్ లింగయత్, వార్డ్ మెంబర్ శ్రీకళ, మహేష్ రాపన్, కళ్యాణ్, శివ, విజయ్, బీమాయ్య రాపన్, హనుమంతు, మహిళా నాయకురాలు సౌజన్య, జయ, వడ్డెర సమాజ్ నాయకులు, బోవి సమాజ్ నాయకులు, యువకులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here