కేబీహెచ్‌బీ 15వ ఫేజ్‌లో మూసివేసిన రోడ్డును తెరిచిన సిఎంసి అధికారులు

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 7 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కేబీహెచ్‌బీ కాలనీ 15వ ఫేజ్‌లో మూసివేసిన రహదారిని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సిఎంసి) టౌన్ ప్లానింగ్ అధికారులు తిరిగి తెరిచారు. కైలాపూర్ 15వ ఫేజ్‌లోని రెయిన్‌బో వైన్స్ వెనుక భాగంలో ఉన్న రహదారిని తెరవాలని గత వారం రోజుల క్రితం స్టేట్ యూత్ కాంగ్రెస్ సెక్రటరీ జిట్టా రమ్యకృష్ణ, సునీల్ యాదవ్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన సిఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టి రహదారిని తెరిచారు. ఈ రహదారి అందుబాటులోకి రావడంతో కేబీహెచ్‌బీ 4వ ఫేజ్ నుంచి వచ్చే వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గనున్నాయని స్థానికులు తెలిపారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన జిట్టా రమ్యకృష్ణ, సునీల్ యాదవ్‌లను స్థానికులు అభినందించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here