కారు గుర్తుకు ఓటు వెయ్యండి.. బంగారు భవిష్యత్తుకు అడ్డంకులు తొలగించండి

  • కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్

నమస్తే శేరిలింగంపల్లి: కారు గుర్తుకు ఓటు వెయ్యండి.. తెలంగాణ రాష్ట్రా బంగారు భవిష్యత్తుకు అడ్డంకులు తొలగించండి అంటూ కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఇంటింటి ప్రచారంలో ప్రజల బాగోగులు తెలుసుకుంటున్న కార్పొరేటర్ హమీద్ పటేల్

డప్పు చెప్పులతో, బీఆర్ఎస్ పార్టీ జెండాలతో, కార్యకర్తలు, నాయకులతో కలసి వాడ వాడ, ఇల్లు ఇల్లు తిరిగి ప్రతి ఓటరును నేరుగా కలసి, అన్న గాంధీని హ్యట్రీక్ ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో కలసి కొండాపూర్ డివిజన్ ప్రేమ్ నగర్ ఏ బ్లాకు, హనీఫ్ కాలనీలలో గడప గడపకు తిరిగి ఓట్లను అభ్యర్థించిన కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి, అన్న అరేకపూడి గాంధీకి అఖండ విజయాన్ని అందించాలని కార్పొరేటర్ హమీద్ పటేల్ ఓటర్లను అభ్యర్థించారు.

పార్టీ శ్రేణులతో ప్రచారంలో హమీద్ పటేల్

కార్యక్రమంలో కార్పొరేటర్ హమీద్ పటేల్, యువ నాయకులు ఆదిల్ పటేల్, జనరల్ సెక్రటరీ పేరుక రమేష్ పటేల్, సెక్రటరీ బలరాం యాదవ్, సీనియర్ నాయకులు రూప రెడ్డి, శ్రీనివాస్ చౌదరి, గౌరీ, మీనా భి, తాడేం మహేందర్, మొహ్మద్ అలీ, తిరుపతి పటేల్, రజనీకాంత్, సయ్యద్ ఉస్మాన్, రవి శంకర్ నాయక్, రవి గౌడ్, అయూబ్ భాయ్, తిరుపతి యాదవ్, కచ్చావా దీపక్, సాయి శామ్యూల్ కుమార్, సరతాజ్, వెంకట్ రెడ్డి, డా. రమేష్, గిరి గౌడ్, వెంకటేష్, యాదగిరి, రామ స్వామి గౌడ్, సత్యం గౌడ్, ఆబేద్ అలీ, నాయుడు, రాజశేఖర్, ప్రభాకర్, కవిటి లక్ష్మి, అమీనుద్దీన్, శ్యామల, లావణ్య, సంతోష, సోమరాజు, మణెమ్మ, అహ్మద్, అభి, సిద్ధూ, సంజీవ, వాసీమ్, ముక్తార్, ఖలీం, తంగమ్మ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here