శేరిలింగంపల్లి, నవంబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): రంగారెడ్డి జిల్లా బీజేపీ వికలాంగుల కన్వీనర్‌గా నియమితులైన పారునంది నాగులును శేరిలింగంపల్లి బీజేపీ నాయకులు ఘనంగా సన్మానించారు. మసీద్ బండలోని శేరిలింగంపల్లి బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నాయకుడు రవికుమార్ యాదవ్ చేతుల మీదుగా నాగులుకు శాలువా కప్పి అభినందనలు తెలిపారు. అదేవిధంగా బీజేపీ నాయకుడు జాజిరావు శ్రీధర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ.. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని, నాయకులు, కార్యకర్తలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యుడు గుండె గణేష్ ముదిరాజ్, ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, సారా రాముతో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.






