రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు పారిజాత నరసింహారెడ్డికి ఘన సన్మానం

శేరిలింగంప‌ల్లి, న‌వంబర్ 6 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన పారిజాత నరసింహారెడ్డిని మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ నాయకులు, ఆల్విన్ కాలనీ సీనియర్ నాయకుడు పట్వారీ శశిధర్ మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పారిజాత నరసింహారెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించి, మొక్కను అందజేసి అభినందనలు తెలియజేశారు. ఆమె నాయకత్వంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలని, పార్టీ అభివృద్ధికి ఆమె అందించే సేవలు, నాయకత్వం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టం చేస్తూ, కార్యకర్తలకు ప్రోత్సాహం అందించి పార్టీని అభివృద్ధి పథంలో నడిపించాలని ఈ సందర్భంగా నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ సీనియర్ నాయకులు బాష్పాక యాదగిరి, బాబ్జి, సాయి లోహిత్, శశి తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here