నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎ ఎస్ రాజు నగర్ కాలనీ వాసులు తమ కాలనీలోని పలు సమస్యలు, చేపట్టవల్సిన అభివృద్ధి పనుల పై మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ని మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్బంగా శ్రీకాంత్ మాట్లాడుతూ A S రాజు నగర్ కాలనీలోనీ సమస్యలను కాలనీ వాసులు తమ దృష్టికి తెచ్చారని, కాలనీలో మౌళికవసతులు కల్పించడమే ప్రధాన ద్యేయంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. కాలనీ ప్రజలకు అందుబాటులో ఉంటూ రోడ్లు, డ్రైనేజి ,మంచినీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు సుధాకర్ రెడ్డి, శ్రీనివాసరావు, దుర్గరాజు, కృష్ణంరాజు, మురళి, శివ, నాగరాజు, వర్మ, సూర్యదేవర శ్రీనివాస్ పాల్గొన్నారు.