నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో గురుపౌర్ణిమ సందర్బంగా రెండో రోజు గురు పూజోత్సవం కొనసాగింది. నృత్యోదయ కూచిపూడి డాన్స్ అకాడమీ వ్యవస్థాపకుడు, గురువర్యులు డాక్టర్ ప్రసన్న రాణి శిష్య బృందం గురు పూజ ఉత్సవాన్ని నిర్వహించారు.
నటరాజ పూజ, గణపతి కౌతం, ఆనంద నర్తన గణపతిమ్ , శివాష్టకం, బాలకనకయ్య, కళింగ నర్తన తిల్లాన, కృష్ణ జనన శబ్దం, అన్నమాచార్య కీర్తనలు, దుర్గ స్తోత్రం, మండూక శబ్దం, భామాకలాపం, సూర్యాష్టకం మొదలైన అంశాలను గురువులు చంద్రశేఖర్, భరణి, నళిని రమణ, రేణుక ప్రభాకర్, కృష్ణ కుమారి, చంద్రలేఖ, హరిప్రియలు ప్రదర్శించారు. అనంతరం డాక్టర్ ప్రసన్నరాణి కి ఘనంగా గురు సత్కారం చేసారు. ఓలేటి రంగమణి, డాక్టర్ జయంతి రెడ్డి, మంజుల రాణి, వరలక్ష్మి కందుకూరి విచ్చేసి గురుసత్కారంలో పాల్గొని శిష్య ప్రశిష్యులను అభినందించి ఆశీర్వదించారు.