నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ ఖాజాగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల విజ్ఞప్తి మేరకు గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా స్పీకర్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికైన కోకిలను, వరంగల్ లో జరిగిన జాతీయ తెలుగు వెలుగు కార్యక్రమంలో సాహిత్యం లో పురస్కారం అందుకున్న ఉపాధ్యాయుడు రాంచంద్రులును శాలువా కప్పి సత్కరించారు. కార్యక్రమంలో హెడ్ మాస్టర్ వెంకట రాం రెడ్డి, ఉపాధ్యాయులు నరహరి, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

