నమస్తే శేరిలింగంపల్లి: టిఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తానని చెప్పిన నిరుద్యోగ భ్రుతిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. సంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ కి బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు & సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ రాగిరి సాయిరాం గౌడ్ మెమోరాండం సమర్పించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేండ్లు గడచిన ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటించక, నిరుద్యోగ భృతి రాక నిరుద్యోగ యువత ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తక్షణమే నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
