నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ గా ఎన్నికై రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ని తెరాస నాయకులు , కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. గడచిన రెండేండ్ల లో డివిజన్ అభివృద్ధికి విశేష కృషి చేశారని, మరింతగా అభివృద్ధి చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి, నాయకులు కార్యకర్తలకు అండగా ఉంటానని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తానని తెలిపారు.