అపస్మారక స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి.. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

నమస్తే శేరిలింగంపల్లి : ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్న సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు పోలీసులు కథనం ప్రకారం.. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 30 నుంచి 35 సంవత్సరాల ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు.

గాంధీ ఆస్పత్రిలో గుర్తు తెలియని వ్యక్తిని చికిత్స నిమిత్తం చేర్చిన మియాపూర్ పోలీసులు

స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం చేరవేయడంతో వారు అక్కడికి చేరుకుని ఆ వ్యక్తిని చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆదివారం చికిత్స పొందుతూ అతను మరణించాడు. వ్యక్తి వివరాలు ఎవరికైనా తెలిస్తే మియాపూర్ పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలని పోలీసులు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here