- ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని కలిసి వినతి పత్రం సమర్పించిన టీఎన్జీఓస్ కాలనీవాసులు
నమస్తే శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని టీఎన్జీఓస్ కాలనీలో పలు సమస్యలు, చేపట్టవలసిన అభివృద్ధి పనుల పై ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిసి ఆయా కాలనీవాసులు. అసంపూర్తిగా మిగిలిపోయిన సీసీ రోడ్లను వేయాలని, కరెంట్ అంతరాయంపై చర్యలు తీసుకోవాలని, వీధి దీపాలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గాంధీ కి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ కాలనీలో నెలకొన్న పలు సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని, దశలవారిగా అన్ని పనులు పూర్తి చేసి ఆదర్శవంతమైన కాలనీగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
ఎక్కువ ప్రెజర్ తో నీటి విడుదల చేస్తామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండ మంచి నీరు వదలాలని అధికారులకు ఆదేశించారు. విద్యుత్ అంతరాయం లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి సమస్య పరిష్కారానికి సత్వరమే చేపట్టేలా ప్రణాళికలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ పార్టీ నాయకులు మంత్రిప్రగడ సత్యనారాయణ, TNGO’ S కాలనీ వాసులు సుధాకర్, సంజీవయ్య, సైది రెడ్డి కాలనీ వాసులు పాల్గొన్నారు.