కుళ్లిన స్థితిలో నాలాలో కొట్టుకొచ్చిన గుర్తు తెలియ‌ని వ్య‌క్తి మృత‌దేహం

న‌మ‌స్తే శేరిలింగంపల్లి: గుర్తు తెలియ‌ని వ్య‌క్తి మృత‌దేహం కుళ్లిన స్థితిలో నాలాలో కొట్టుకొచ్చిన సంఘ‌ట‌న చందాన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం… చందాన‌గ‌ర్ పిజెఆర్ స్టేడియం వెనుక‌వైపు నాలాలో ఓ పురుషుడి మృత‌దేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న పోలీసులు ప‌రిస‌ర ప్రాంత ప్ర‌జ‌ల‌ను విచారించిన‌ప్ప‌టికీ మృతుడి వివ‌రాలు తెలియ రాలేదు. వేరే ప్ర‌దేశం నుండి మృత‌దేహం వ‌ర్ష‌పు నీటికి మురికి కాలువ‌లో కొట్టుకొచ్చి ఉండ‌వ‌చ్చ‌ని పోలీసులు భావిస్తున్నారు. మృత‌దేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో గుర్తు ప‌ట్ట‌లేని విధంగా ఉంది. దీంతో పోలీసులు శ‌వ పంచ‌నామా నిర్వ‌హించి మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించి కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

నాలాలో కొట్టుకొచ్చిన గుర్తు తెలియ‌ని వ్య‌క్తి మృత‌దేహం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here