ప్ర‌జా సంగ్రామ యాత్రలో శేరిలింగంప‌ల్లి హ‌నుమంతుడి సంద‌డి – ఆక‌ట్టుకున్న ఆర్‌కేవై టీం స‌భ్యుడు గోపి

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: బండి సంజ‌య్ ప్ర‌జా సంగ్రామ పాద‌యాత్ర‌లో శేరిలింగంప‌ల్లికి చెందిన క‌ళాకారుడు హ‌నుమంతుడి వేష‌ధార‌ణలో సంద‌డి చేశారు. పీఏ న‌గ‌ర్‌లో నివాసం ఉండే గోపినాయ‌కుడు వృత్తి రిత్యా డ్యాన్స్ మాస్ట‌ర్‌. స్థానిక సెంటియా ది గ్లోబ‌ల్ స్కూల్‌లో చిన్నారుల‌కు డ్యాన్స్ క్లాస్‌లు తీసుకుంటాడు. అదేవిధంగా ర‌వికుమార్ యాద‌వ్‌(ఆర్‌కేవై) టీం స‌భ్యుడిగా స్థానికంగా సేవా కార్య‌క్ర‌మాల‌లో చురుకుగా పాల్గొంటుంటాడు. ఐతే ప్ర‌జా సంగ్రామ యాత్ర ఆదివారం వికార‌బాద్ జిల్లాలో కొన‌సాగుతున్న నేప‌థ్యంలో గోపినాయుడు హ‌నుమంతుడి వేష‌దార‌ణ‌లో యాత్రికుల‌ను ఆక‌ట్టుకున్నారు. ర‌వికుమార్ యాద‌వ్ గోపిని బండి సంజ‌య్‌, ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్‌ల‌కు ప‌రిచ‌యం చేశారు. హ‌నుమంతుడి రాక‌తో ప్ర‌జా సంగ్రామ యాత్రలో బిజెపి శ్రేణుల ఉత్సాహం రెట్టింప‌య్యింది. ఈ కార్య‌క్ర‌మంలో బిజెపి నాయ‌కులు రాచ‌మ‌ళ్ల నాగేశ్వ‌ర్‌ గౌడ్‌, ఆకుల ల‌క్షణ్ ముదిరాజ్‌, సూర్ణ శ్రీశైలం కురుమ త‌దిత‌రులు పాల్గొన్నారు.

బండి సంజ‌య్‌, ధ‌ర్మ‌పురి అర‌వింద్‌ల‌కు హ‌నుమంతుడి వేష‌ధారి గోపినాయుడిని ప‌రిచ‌యం చేస్తున్న ర‌వికుమార్ యాద‌వ్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here