అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యని పరిష్కరించండి : బీజేపి నాయకుడు పోరెడ్డి బుచ్చిరెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి : తారనగర్ కాలనీలోని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యని పరిష్కరించాలని హెచ్ఎండబ్ల్యు ఎస్ఎస్బీ జీఎం రాజశేఖర్ కి బీజేపి నాయకుడు పో రెడ్డి బుచ్చిరెడ్డి వినతి పత్రం ఇచ్చారు. శేరిలింగంపల్లి అసెంబ్లీ , చందానగర్ డివిజన్ , తార నగర్ కాలనీ నుండి గోపీనాథ్ కాంప్లెక్స్ రోడ్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పొంగిపొర్లుతూ ఆ రహదారి మురుగుతో నిండిపోతుందని కొన్ని రోజులు కిందట స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంబంధిత అధికారితో ఫోన్ మాట్లాడగా.. హెచ్ఎండబ్ల్యు ఎస్ఎస్బీ అధికారులు వచ్చి నామమాత్రంగా పనులు చేపట్టి వెళ్లారని, పూర్తిగా చేయలేదని ఆయనకు తెలిపారు. వెంటనే డ్రైనేజీ లైన్ లో నిండిపోయిన చెత్తను తీసివేసి , శుభ్రం చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, వీలైతే కొత్తగా లైన్ వేయాలని బిజెపి తరపున డిమాండ్ చేశారు. హెచ్ఎండబ్ల్యు ఎస్ఎస్బీ జీఎం రాజశేఖర్ స్పందిస్తూ , వెంటనే సంబంధిత అధికారులను పంపించి సమస్యని పరిష్కరించే దిశగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పోరెడ్డి బుచ్చిరెడ్డి , మజ్దూర్ మోర్చా జిల్లా అధ్యక్షుడు వర ప్రసాద్ , బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కైతాపురం జితేందర్, ఇతరులు పాల్గొన్నారు.

హెచ్ఎండబ్ల్యు ఎస్ఎస్బీ జీఎం రాజశేఖర్ కి వినతి పత్రం ఇస్తున్న బీజేపి నాయకుడు పో రెడ్డి బుచ్చిరెడ్డి
పొంగి పొర్లుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మురుగు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here