- అభివృద్ధి పనుల్లో రాజీ వద్దు
- త్వరితగతిన పూర్తిచేసి ప్రతిపాదనలు తేవాలి
- పనుల స్థితిగతి, పురోగతిపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం
- విద్యుత్, రోడ్లు, తాగునీటి , డ్రైనేజి సమస్యలపై చర్చించిన ప్రభుత్వ విప్ గాంధీ
- రోడ్లు తవ్విన వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశం
- శ్మశాన వాటికల అభివృద్ధి పనులపై అసంతృప్తి
నమస్తే శేరిలింగంపల్లి: అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కలిసి పని చేయాలని, అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా పనులు పూర్తీ చేయాలనీ అధికారులకు ఆదేశించారు ప్రభుత్వ విప్ గాంధీ. మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధి పనుల స్థితిగతుల పై కార్పొరేటర్లు హమీద్ పటేల్, రాగం నాగేందర్ యాదవ్ , జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్ , మంజుల రఘునాథ్ రెడ్డి , సింధు ఆదర్శ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయి బాబా, GHMC ఇంజనీరింగ్ విభాగం, జలమండలి, టౌన్ ప్లానింగ్, ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్స్ విభాగం అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వివిధ ప్రభుత్వ శాఖల పనితీరును సమీక్షిస్తూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో అభివృద్ధి చేపట్టేలా దిశానిర్ధేశం చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కలిసి పని చేయాలని సూచించారు. పనుల స్థితిగతి, పనుల పురోగతి, ఇటీవల కురిసిన వర్షాల కారణంగా దెబ్బ తిన్న రోడ్లు పునరుద్ధరించడం కోసం ప్రతిపాదించిన పనులు , కొత్త ప్రతిపాదనలు మంజూరైన పనులు, శంకుస్థాపనకు సిద్ధమైన వాటి సమగ్ర సమాచారం పై చర్చించారు. గుల్ మోహర్ పార్క్ ప్రహరీ వెంటనే చేపట్టాలని, డ్రైనేజి వ్యవస్థ పై, STP లకు అనుసంధానం చేసే ఔట్ లెట్ ల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రోడ్ కట్టింగ్ సమయంలో తాగునీటి , డ్రైనేజి పైప్ లైన్ వేసేటప్పుడు తవ్విన రోడ్ల ను వెంటనే మరమ్మతులు చేయాలని, UGD, రోడ్లు పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయా శాఖల అధికారులకు తెలిపారు. అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, కొత్త ప్రతిపాదనలు తీసుకురావాలని, పటేల్ చెరువు, గంగారాం చెరువు పనుల పురోగతి పై దృష్టి పెట్టాలని ఆదేశించారు. కాలనీలలో నెలకొన్న విద్యుత్ సంబంధిత సమస్యలు( వేలాడుతున్న విద్యుత్ తీగలు సరిచేయడం, ట్రాన్స్ ఫార్మర్ల చుట్టూ కంచె వేయడం, అవసరమున్న చోట స్తంభాలు, వీధి దీపాలు ఏర్పాటు) పరిష్కరించాలని విద్యుత్ విభాగం అధికారులకు తెలిపారు. గోకుల్ ప్లాట్స్ లో త్వరితగతిన ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శ్మశాన వాటికల అభివృద్ధి పనులు మందకొండిగా ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేస్తూ పనులలో వేగం పెంచాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ విరేశం గౌడ్, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, GHMC SE శంకర్ నాయక్ , EE శ్రీనివాస్ , EE శ్రీకాంతిని, DEలు సురేష్, రమేష్, స్రవంతి, AEలు సునీల్, ప్రశాంత్, శివ ప్రసాద్, ప్రతాప్, జగదీష్, AMOH కార్తిక్, జలమండలి అధికారులు GM రాజశేఖర్, DGM నాగప్రియ , మేనేజర్లు సుబ్రమణ్యం, యాదయ్య, సందీప్, నరేందర్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, సాయి చరిత, సునీత, మానస ACP సంపత్, స్ట్రీట్ లైట్స్ ఈ ఈ ఇంద్రదీప్ , DE సునీల్, AE రామ్మోహన్ ,రాజశేఖర్ , విద్యుత్ విభాగం అధికారులు DE, ADE , AE లు పాల్గొన్నారు.