నమస్తే శేరిలింగంపల్లి: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హఫీజ్‌పేట ఎస్సై అహమద్ పాషా అన్నారు. మియాపూర్‌లోని సాయిరామ్ టవర్స్ లో సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు.
ఇన్‌స్టంట్ లోన్ యాప్‌లు, కస్టమర్ కేర్ మోసం, లాటరీ మోసాలు, ఓఎల్‌ఎక్స్ మోసం, పెట్టుబడి మోసాలు.. తదితర వాటిని నమ్మవద్దని సూచించారు. ఇబ్బడిముబ్బడిగా ఆన్‌లైన్ షాపింగ్, ట్రేడింగ్‌లు చేసి సైబర్ నేగాళ్ల చేతికి చిక్కుతున్నారని, ఫలితంగా. క్షణాల్లో వేలు, లక్షల్లో నష్ట పోతున్నట్లు తెలిపారు, ఇలాంటి వాటిపట్ల నిత్యం అప్రమత్తంగా ఉంటూ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.