నమస్తే శేరిలింగంపల్లి: లాభాపేక్ష లేకుండా, రాజకీయాలకతీతంగా సమాజానికి సేవ చేయాలనే మానవతా దృక్పథంతో తమ ట్రస్ట్ సేవలు అందిస్తున్నదని ట్రస్ట్ చైర్మన్, మాజీ శాసనసభ్యులు బిక్షపతి యాదవ్ అన్నారు. సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మదీనాగూడ గ్రామంలో ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. అత్యాధునిక, అనుభవజ్ఞులైన డాక్టర్లచే కంటి పరీక్షలు చేయించడం పరీక్షలకు తగ్గట్టుగా కంటి అద్దాలను , కంటి ఆపరేషన్లు చేయించడం తమ ట్రస్ట్ ప్రత్యేకత అని తెలిపారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ బిక్షపతి యాదవ్ మాట్లాడుతూ ప్రపంచంలో మనుషులకు, జీవరాసులకు కళ్ళు చాలా సున్నితమైనవని, వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకున్నట్లయితే ప్రపంచాన్ని చూడగలుగుతావని లేకపోతే జీవితం అంధకారం అవుతుందని చెప్పారు.
నియోజకవర్గంలోని కాలనీలో, బస్తీలలోని నిరుపేదలకు సందయ్య మెమోరియ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా కంటి పరీక్షలు చేసి అవసరమైన వారందరికీ కంటి అద్దాలు అందించి, అవసరమైనా వారికి ఆపరేషన్లు చేఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ గౌడ్, యాదగిరి ముదిరాజ్, సత్యనారాయణ , సురేష్ యాదవ్ ,శివ ముదిరాజ్, కృష్ణ, బండారి రమేష్, మల్లేష్ ,దయాకర్ రెడ్డి, యూసుఫ్, గణేష్ ముదిరాజ్, శ్రీనివాస్ యాదవ్ ప్రసాద్, కృష్ణంరాజు, రాము, పద్మా ,రేణుక పాల్గొన్నారు.