నమస్తే శేరిలింగంపల్లి: 106 డివిజన్ లింగంపల్లి గ్రామంలో ఏఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రేవంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు వేడుకగా నిర్వహించారు.
ఈ ఉత్సవాల్లో టీపీసీసీ జనరల్ సెక్రటరీ జేరిపేటి జైపాల్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో యువజన నాయకులు సూర్య రాథోడ్ , డివిజన్ సీనియర్ నాయకులు రాజేందర్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ కవిరాజ్ తలారీ, కొండా పాల్గొన్నారు.