వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం

  • లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద రూ. 4 కోట్లతో బాక్స్ కల్వర్ట్ , వరద నీటి కాల్వ నిర్మాణం పనులకు శంకుస్థాపన
  • బిఆర్ ఎస్ చేతల ప్రభుత్వమని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ వెల్లడి

నమస్తే శేరిలింగంపల్లి: వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద రూ. 4 కోట్ల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టనున్న బాక్స్ కల్వర్ట్ , వరద నీటి కాల్వ నిర్మాణం పనులకు కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, మంజుల రఘునాథ్ రెడ్డి, హమీద్ పటేల్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా బాక్స్ కల్వర్ట్ , వరద నీటి కాల్వ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసుకోవడం సంతోషకరమైన విషయమని అన్నారు. ఎన్నో ఏండ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు.

తమది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వమన్నారు. సమస్యకు పరిష్కారం చేసి చూపెడుతామని తెలిపారు. వర్షం పడుతున్న ప్రతిసారి లింగంపల్లి అండర్ బ్రిడ్జి నీటితో నిండిపోవడం వలన పరిసర ప్రాంత ప్రజలకు, వాహన దారులకు , ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యను పరిగణలోకి తీసుకుని శాశ్వత పరిష్కారం దిశగా అండర్ బ్రిడ్జి నుండి వరద నీటి కాల్వ, బాక్స్ కల్వర్ట్ నిర్మాణం పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు రఘుపతి రెడ్డి, మోహన్ గౌడ్ ,లక్ష్మీ నారాయణ గౌడ్, విరేశం గౌడ్, సోమదాసు , చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘనాథ్ రెడ్డి, శేరిలింగంపల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు యాదగిరి గౌడ్ , జనార్దన్ రెడ్డి, ఉరిటీ వెంకట్ రావు, దాసరి గోపి, శ్రీనివాస్ నాయక్, అన్వర్ షరీఫ్, చింత కింది రవీందర్ గౌడ్, పొడుగు రాంబాబు, పద్మారావు, కృష్ణ యాదవ్, కొండల్ రావు, రఘునాథ్, నాగరాజు, ప్రసాద్, వేణు గోపాల్ రెడ్డి, రమేష్, గోపి కృష్ణ ,అక్బర్ ఖాన్, యూసఫ్, నటరాజు, పవన్, సందీప్ రెడ్డి, అవినాష్, రాజశేఖర్, గోపాల్ యాదవ్, రాథోడ్, గుడ్ల ధనలక్ష్మి, వరలక్ష్మి, కవిత, శ్రీ కళ, పర్వీన్ బేగం, రజిని, సౌజన్య, భాగ్యలక్ష్మి, జయ, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here