తెలంగాణ హకీ అద్యక్షునికి అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ హకీ అద్యక్షుడిగా కొండ విజయ్ కుమార్ ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కొండ విజయ్ కుమార్ ని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు.

తెలంగాణ హకీ అద్యక్షుడు కొండ విజయ్ కుమార్ కు హాకీ ని బహూకరిస్తున్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ జాతీయ క్రీడ హకీకి శేరిలింగంపల్లి ప్రాంతానికి చెందిన వ్యక్తి కొండ విజయ్ అధ్యక్ళుడిగా ఎన్నిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని, హాకీ క్రీడాకారులకు గుర్తింపు వచ్చేలా కృషి చేయాలని, తనవంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాయని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు.

ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీతో..

గచ్చిబౌలి బాలయోగి స్టేడియం , మరియు చందానగర్ పిజెఆర్ స్టేడియంలో హకీ క్రీడకు మరిన్ని సౌకార్యాలు కల్పించాలని కొండ విజయ్ ఎమ్మెల్యే గాంధీని కోరారు. కార్యక్రమంలో చంద్రమోహన్ సాగర్, శివ సాగర్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here