అందరికీ మహావిష్ణువు అనుగ్రహం కలగాలి : ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

శిల్ప పార్క్ కాలనీలోని రామ లింగేశ్వర స్వామి దేవస్థానంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రత్యేక పూజలు
నమస్తే శేరిలింగంపల్లి : ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని మాదాపూర్ డివిజన్ పరిధిలోని శిల్ప పార్క్ కాలనీ లోని శ్రీ శ్రీ శ్రీ రామ లింగేశ్వరస్వామి దేవస్థానంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నది. ఈ దేవస్థానానికి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ వెళ్లి ప్రత్యేక పూజలు చేపట్టారు.

రామ లింగేశ్వరస్వామి దేవస్థానంలో పూజలు చేసి హారతి తీసుకుంటున్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పాత్రికేయ మిత్రులకు, అభిమానులకు ముక్కోటి ఏకాదశి పర్వదినం శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి పండగ మనందరికీ ఎంతో ప్రాముఖ్యమైనదని, చాలా పవిత్రమైనదని, చిత్తశుద్ధితో కల్మషం లేకుండా శ్రీ మహా విష్ణువునకు పూజాధికాలు నిర్వహించి ఉపవాసం ఉంటే..మానవ జీవితంలో ఉత్తమ ఆధ్యాత్మిక మార్గం కనుగొనవచ్చని, మహావిష్ణువు కటాక్షం కూడా కలుగుతుందని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీతో..

ముక్కోటి ఏకాదశి రోజున మహావిష్ణువు గరుడ వాహనంపై విహరిస్తూ మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి, భక్తులకు దర్శనం ఇస్తారని పురాణాలు చెబుతున్నాయని తెలిపారు. ఉత్తర ద్వారం గుండా సాక్ష్యత్తు మహా మహావిష్ణువు దర్శిస్తే..మోక్షం కలుగుతుందని సర్వ జనులకు శుభం కలగాలని, మహావిష్ణువు అనుగ్రహము ప్రతీ ఒక్కరికీ కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, కాలనీవాసులు నవీన్, నందు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here