- భారత రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులర్పించిన శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి : సమసమాజ స్వాప్నికుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా|| బి.ఆర్.అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆ మహనీయుడి ఎనలేని దేశ సేవను గుర్తుచేసుకోవాలని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు.

మాదాపూర్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ డాక్టర్.బి.ఆర్.బాబా సాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
