యువతకు ప్రోత్సాహామిస్తూ టోర్నమెంట్ నిర్వహిస్తాం : బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి మాజీ శాసన సభ్యుడు భిక్షపతి యాదవ్ తృతీయ పుత్రుడు, రవికుమార్ యాదవ్ సోదరుడు రాజ్ కుమార్ యాదవ్ జ్ఞాపకార్ధం ఆర్.కే.వై ఫౌండేషన్ ఆధ్వర్యంలో లింగంపల్లి లీగల గ్రౌండ్, బి. హెచ్.ఈ.ఎల్ గ్రౌండ్ లలో టి 20 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ పాల్గొని ఇరుజట్లకు శుభాకాంక్షలు తెలియజేసి, టాస్ వేసి మ్యాచ్ ను ప్రారంభించారు.

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో బ్యాట్ చేత బట్టిన నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్
క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్

ఈ సందర్భంగా ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్న నిర్వాహకులకు, పాల్గొంటున్న క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. నియోజకవర్గంలో యువకులదరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆటల వల్ల శారీరక, మానసికోల్లాసంతోపాటు ప్రతి పనిలో ఏకాగ్రత లభిస్తుందన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ కి, ఈ టోర్నమెంట్ నిర్వహణకు కష్టపడిన ప్రతి ఒక్కరికీ బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. తన సోదరుడు రాజ్ కుమార్ యాదవ్ జ్ఞాపకార్ధం ..ఆర్.కే .వై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ ను నియోజకవర్గంలో ఉన్న యువతలో ఉన్న ప్రతిభను వెలికతీసేందుకు గతంలో కూడా నిర్వహించామని కొంతకాలం కరోనా వల్ల నిర్వహించలేకపోయామని ఇప్పుడు మరల మొదలు పెట్టడం ఆనందంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో టోర్నమెంట్ ను అన్ని డివిజన్లలో నిర్వహించి నియోజకవర్గంలో ప్రతి యువకుడి కి చేరుకునేలా ఈ టోర్నమెంట్ ను తీసుకుని వెళ్తామన్నారు. ఇక్కడ ఆడటానికి వచ్చిన ప్రతి క్రీడాకారునికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకట్ రెడ్డి పటేల్, రాఘవేంద్ర రావు, రాధాకృష్ణ యాదవ్, ఏళ్లేశ్, అనికుమార్ యాదవ్ , రమేష్, హనుమంత్ నాయక్, సోమయ్య యాదవ్, చంద్రమౌళి, అరుణ్, గణేష్ ముదిరాజ్, శ్రీనివాస్ యాదవ్, శ్రీను.జే, రాము.జే, కౌశిక్, కృష్ణ బాలయ్య, దేవేందర్, జగదీష్, కిట్టు, సహదేవ్, పవన్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here