ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి : కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ లోని సురభి కాలనీలోని సురభి యువసేన కమిటీ హాల్ లో చైల్డ్ ఫండ్ ఆధ్వర్యంలో హెచ్ఎస్ బిసి సహకారంతో మహిళలకు ఉపాధి కల్పించే దిశగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ కి పూలబొకే ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ చైల్డ్ ఫండ్ సంస్థ ఉమెన్ ఎంపవర్ మెంట్ కోసం చేపట్టిన ఒక మంచి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, నాలుగు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ఉపాధి పొంది భావితరాలకు మార్గదర్శకులుగా ఉండాలని అన్నారు.

కార్యక్రమానికి హాజరైన మహిళలు
కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కి పూలబొకే ఇచ్చి స్వాగతం పలుకుతున్న చైల్డ్ ఫండ్ సంస్థ

ఈ ప్రాంత మహిళలకు ఒక మంచి ఉపాధి మార్గం కల్పిస్తూ అవకాశం ఇస్తునందుకు చైల్డ్ ఫండ్ వారికి హెచ్ఎస్ బిసి వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు వీరేశం గౌడ్, ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రకాష్ రెడ్డి, ఫీల్డ్ ఆఫీసర్ అనురాజ్, సీనియర్ ఆఫీసర్ శ్రీశైలం, ఫీల్డ్ కోఆర్డినేటర్ గ్రేస్, కమ్యూనిటీ మొబిలైజర్ దీప, ఫీల్డ్ కోఆర్డినేటర్ దివ్య, కమ్యూనిటీ మొబిలైజర్ అంరీత, వార్డ్ మెంబర్ శ్రీకళ, వార్డ్ మంబర్ కవిత గోపాల కృష్ణ, వెంకట్ రెడ్డి, గోపాల్ యాదవ్, కొయ్యడ లక్ష్మణ్ యాదవ్, నర్సింహా, స్వరూప, భాగ్యలక్ష్మి, సౌజన్య, జయ, కుమారి, సుధారాణి, కళ్యాణి, రోజరాణి, రమాదేవి, రాములమ్మ, శశికళ, రోజా, తుకారం, వినయ్, శ్యామ్, స్థానిక వాసులు, మహిళలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here