- థీమ్ పార్క్ సుందరీకరణ, అభివృద్ధి నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీ లో రూ. 4 కోట్ల అంచనా వ్యయం తో నూతనంగా చేపట్టబోయే థీమ్ పార్క్ సుందరీకరణ, అభివృద్ధి నిర్మాణం పనులకు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ పార్క్ ను అన్ని రంగాలలో సుందరికరించి, అన్ని హంగులతో , అన్ని రకాల మౌళిక వసతులతో సుందరీకరించి ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకురావాలని, పార్క్ సుందరీకరణ, అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు.

మయూరి నగర్ పచ్చని చెట్లతో విరాజిల్లాలని, మయూరి నగర్ కు చాలా ప్రాధాన్యత ఉందని, ఆ ప్రాధాన్యతలో భాగంగా మయూరి నగర్ లోని పార్కుల్లో పచ్చని చెట్లు కనిపించాలని, దానికి మయూరి నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కృషి చేయాలని సూచించారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని కాలుష్యాన్ని రూపుమాపి ఆరోగ్యకర వాతావరణానికి చెట్లు ఎంతగానో దోహదపడతాయని, పార్కులో లో పూలు పండ్లు ఆరోగ్యానికి ఉపయోగపడే మొక్కలు నాటి వాటి పరిరక్షణకు సహకరించాలని కోరారు. ప్రభుత్వ పరంగా మయూరి నగర్ అభివృద్ధికి కృషి చేస్తామనీ హామీ ఇచ్చారు. మయూరినగర్ లో అందరూ ఐకమత్యంగా ఉంటూ రాష్ట్రంలోని ఆదర్శ కాలనీగా అభివృద్ధి చేసేందుకు అసోసియేషన్ కృషి చేయాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు,బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, అభిమానులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





